South India's No.1 Digital Mobile Paper
LIVE
Welcome to Smacy Media

కోస్తాంధ్రకు తరచూ తుపాన్ల ముప్పు.. శాశ్వత పరిష్కారం చూపాలి: చంద్రబాబు

కోస్తాంధ్రకు తరచూ తుపాన్ల ముప్పు.. శాశ్వత పరిష్కారం చూపాలి: చంద్రబాబు

అమరావతి: మురసు తుపాను రాష్ట్రానికి రూ.2,484 కోట్లకుపైగా నష్టం మిగిల్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu) కేంద్ర బృందానికి తెలిపారు. 1.43 లక్షల హెక్టార్లలో పంటలు దెబ్బతినగా, 1.86 లక్షల మంది రైతులు నష్టపోయారని వివరించారు. దెబ్బతిన్న ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేసిన కేంద్ర బృందం.. ముఖ్యమంత్రితో వర్చువల్‌గా సమావేశమైంది. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి చిత్తరంజన్ దాస్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యులు.. రెండు బృందాలుగా విడిపోయి బాపట్ల, పల్నాడు, ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో దాదాపు 60 ప్రాంతాలను సందర్శించారు. దెబ్బతిన్న పంట పొలాలు, రహదారులు, కాలువలు, ఇళ్లు, విద్యుత్ వ్యవస్థలను పరిశీలించారు.

రైతులు, మత్స్యకారులతో నేరుగా మాట్లాడి నష్టం వివరాలు సేకరించారు. ఎల్‌నినో ప్రభావానికి తోడు ఒకేసారి రెండు తుపాన్లు రావడంతో రాష్ట్రానికి భారీ నష్టం జరిగిందని చంద్రబాబు కేంద్ర బృందానికి వివరించారు. తుపాను గమనాన్ని ముందుగానే అంచనా వేసి సహాయక చర్యలు చేపట్టామని, 24 గంటల్లోనే రహదారులు, విద్యుత్, మొబైల్ నెట్‌వర్క్‌ సేవలను పునరుద్ధరించామని తెలిపారు. పంట నష్టపోయిన రైతులకు బీమా పరిహారం త్వరగా అందేలా చర్యలు తీసుకుంటున్నామని, ప్రభావిత ప్రాంతాల్లో అదనపు రేషన్ కూడా పంపిణీ చేశామని చెప్పారు. కోస్తాంధ్రకు తుపాన్ల ముప్పు తరచూ ఉంటున్నందున శాశ్వత పరిష్కారంగా మౌలిక వసతులను మరింత పటిష్ఠం చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఇందుకు కేంద్రం ప్రత్యేకంగా సహకరించాలని కోరారు. పది రోజుల్లో నష్టంపై సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. తాము పరిశీలించిన ప్రాంతాల్లో ఫ్లాష్‌ ఫ్లడ్స్‌తో గ్రామీణ రహదారులు, విద్యుత్ స్తంభాలు భారీగా దెబ్బతిన్నాయని కేంద్ర బృందం వెల్లడించింది. వరి పంటకు తూర్పుగోదావరిలో 80 శాతం, ఏలూరులో 90 శాతం వరకు నష్టం జరిగినట్లు గుర్తించామని తెలిపింది. మామిడి, బొప్పాయి వంటి ఉద్యాన పంటలకూ తీవ్ర నష్టం వాటిల్లిందని వివరించింది. పంటల బీమా ప్రీమియం అధికంగా ఉండటంతో పత్తి రైతుల్లో చాలామంది బీమా చేయించుకోలేకపోయారని తెలిపింది. కచ్చా ఇళ్లు కోల్పోయిన కుటుంబాలు, గిరిజనులు, ప్రకృతి వ్యవసాయ రైతులకు ప్రత్యేక సాయం అందించాలని సూచించింది.

📍 East Godavari
📰 Eenadu Telugu
🕒 6 days ago

Related News

మలివిడత పుర పోరు .. మేయర్‌, ఛైర్మన్‌ స్థానాలకు కూటమి అభ్యర్థులు వీరే
మలివిడత పుర పోరు .. మేయర్‌, ఛైర్మన్‌ స్థానాలకు కూటమి అభ్యర్థులు వీరే
వ్యోమనౌకను గాల్లోనే ఒడిసిపట్టి
వ్యోమనౌకను గాల్లోనే ఒడిసిపట్టి
డబ్ల్యూపీఎల్ 2027.. ఆ మ్యాచ్‌లన్నీ వాంఖడే స్టేడియంకు షిప్ట్
డబ్ల్యూపీఎల్ 2027.. ఆ మ్యాచ్‌లన్నీ వాంఖడే స్టేడియంకు షిప్ట్
⬅ Back
➕ Post Ad
To Ads ➡