South India's No.1 Digital Mobile Paper
LIVE
Welcome to Smacy Media

మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తాం: మంత్రి శ్రీధర్ బాబు

మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తాం: మంత్రి శ్రీధర్ బాబు

మంథని, వెలుగు: దేశంలో ప్రజా సంకల్పంతో ముందుకెళ్తున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ అని, ప్రజల కోసం మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని వినాయకుడిని వేడుకున్నారు. మంథనిలోని రావుల చెరువుకట్టలో ఉన్న హనుమాన్ ఆలయంలో ఏర్పాటు చేసిన గణనాథుడి వద్ద హోమంలో మంత్రి పాల్గొని పూజలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని విఘ్నేశ్వరుడి కోరుకున్నట్లు తెలిపారు.
ప్రజా సంకల్పంతో ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ముందుకు వెళ్తోందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్​పర్సన్ వోడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్​పర్సన్ సహేందర్ రెడ్డి, పాలకవర్గ సభ్యులు, న్యాయవాది శశిభూషణ్, మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకన్న, సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, మండల పార్టీ అధ్యక్షుడు అయిలి ప్రసాద్, పట్టణ అధ్యక్షుడు పోలు శివ తదితరులు పాల్గొన్నారు.

📍 Telangana
📰 V6 News
🕒 2 days ago

Related News

మలేషియాలో టూరిస్ట్ వీసాతో ఉద్యోగం చేయొద్దు : భారత హైకమిషన్
మలేషియాలో టూరిస్ట్ వీసాతో ఉద్యోగం చేయొద్దు : భారత హైకమిషన్
గ్రాడ్యుయేట్ ఓట్లు నమోదు చేయించండి ..పార్టీ నేతలకు కేటీఆర్, హరీశ్రావు దిశానిర్దేశం
గ్రాడ్యుయేట్ ఓట్లు నమోదు చేయించండి ..పార్టీ నేతలకు కేటీఆర్, హరీశ్రావు దిశానిర్దేశం
Today's Motivation
Today's Motivation
Back
Post Ad
To Ads