South India's No.1 Digital Mobile Paper
LIVE
Welcome to Smacy Media

గ్రాడ్యుయేట్ ఓట్లు నమోదు చేయించండి ..పార్టీ నేతలకు కేటీఆర్, హరీశ్రావు దిశానిర్దేశం

గ్రాడ్యుయేట్ ఓట్లు నమోదు చేయించండి ..పార్టీ నేతలకు కేటీఆర్, హరీశ్రావు దిశానిర్దేశం

హైదరాబాద్, వెలుగు: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై బీఆర్‌‌‌‌ఎస్ ఫోకస్​పెట్టింది. ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని నేతలకు ఆ పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ ​సూచించారు. మంగళవారం తెలంగాణ భవన్‌‌‌‌లో కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌‌‌‌రావు నేతృత్వంలో హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌‌‌‌నగర్ ఉమ్మడి జిల్లాల పరిధిలోని మాజీ మంత్రులు, ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయానికి ఓటర్ల నమోదే అత్యంత కీలకమని, దీనిపై పార్టీ శ్రేణులు మొదటి నుంచే ప్రత్యేక దృష్టి పెట్టాలని తేల్చి చెప్పారు. నియోజకవర్గాల వారీగా గ్రాడ్యుయేట్లను గుర్తించి, వారిని ఓటర్లుగా నమోదు చేయించే బాధ్యతను స్థానిక నాయకత్వం తీసుకోవాలని స్పష్టం చేశారు. ఓటర్ల ఎన్‌‌రోల్‌‌మెంట్‌‌‌‌ ప్రక్రియను అత్యంత పకడ్బందీగా చేపట్టాలని, ఎక్కడా నిర్లక్ష్యానికి తావివ్వకూడదన్నారు.

కాంగ్రెస్ సర్కార్‌‌‌‌పై అన్ని వర్గాల్లోనూ వ్యతిరేకత
కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో, ప్రత్యేకించి విద్యావంతుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని కేటీఆర్​, హరీశ్​ రావు పేర్కొన్నారు. విద్యార్థులు, నిరుద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, గ్రాడ్యుయేట్లలో ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోందన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు, నిరుద్యోగుల సమస్యలు పరిష్కారం కాకపోవడంపై విద్యావంతులైన వర్గాలు ఆగ్రహంతో ఉన్నారని పేర్కొన్నారు.

ప్రస్తుత పరిస్థితులు బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌కు పూర్తి అనుకూలంగా ఉన్నాయని, సరైన వ్యూహంతో పనిచేస్తే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు. ఎన్నికల సన్నద్ధతలో భాగంగా ఉమ్మడి జిల్లాల వారీగా నిర్దిష్ట కార్యాచరణను రూపొందించుకోవాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా త్వరలోనే హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌‌‌‌నగర్ ఉమ్మడి జిల్లాల పరిధిలోని ప్రస్తుత ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా మరో విడత సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు.

📍 Telangana
📰 V6 News
🕒 53 mins ago

Related News

మలేషియాలో టూరిస్ట్ వీసాతో ఉద్యోగం చేయొద్దు : భారత హైకమిషన్
మలేషియాలో టూరిస్ట్ వీసాతో ఉద్యోగం చేయొద్దు : భారత హైకమిషన్
Today's Motivation
Today's Motivation
Daily Calender
Daily Calender
Back
Post Ad
To Ads