South India's No.1 Digital Mobile Paper
LIVE
Welcome to Smacy Media

22ఏ భూములపై బీఆర్ఎస్ కుట్రలు : టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్

22ఏ భూములపై బీఆర్ఎస్ కుట్రలు : టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్

హైదరాబాద్, వెలుగు: 22ఏ భూముల విషయంలో ప్రభుత్వంపై బురదజల్లేందుకు బీఆర్ఎస్ కుట్రలు చేస్తోందని టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ అన్నారు. కేసీఆర్​ కుటుంబం ఫామ్ హౌస్​లు కట్టుకోవడానికేనా తెలంగాణ తెచ్చుకున్నదన్న సందేహం ప్రజల్లో కలుగుతోందని ఫైర్ అయ్యారు. ఆదివారం నాంపల్లిలోని గాంధీభవన్‌‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.
పదేండ్ల బీఆర్ఎస్ పాలన కేవలం భూములు, కబ్జాల చుట్టూనే తిరిగిందన్నారు. కేసీఆర్ ల్యాండ్ సీలింగ్ చట్టాన్ని తుంగలో తొక్కారన్నారు. కేటీఆర్, హరీశ్ రావు, సంతోష్ రావు, కవిత.. అక్రమ భూముల సంపాదన కోసం పోటీలు పడ్డారని ఆరోపించారు. జన్వాడ ఫామ్‌‌హౌస్ లీజుదే అయితే.. గతంలో దానిపై డ్రోన్ ఎగరేస్తే కేసులు ఎందుకు పెట్టించారని ప్రశ్నించారు.

📍 Telangana
📰 V6 News
🕒 2 days ago

Related News

మలేషియాలో టూరిస్ట్ వీసాతో ఉద్యోగం చేయొద్దు : భారత హైకమిషన్
మలేషియాలో టూరిస్ట్ వీసాతో ఉద్యోగం చేయొద్దు : భారత హైకమిషన్
గ్రాడ్యుయేట్ ఓట్లు నమోదు చేయించండి ..పార్టీ నేతలకు కేటీఆర్, హరీశ్రావు దిశానిర్దేశం
గ్రాడ్యుయేట్ ఓట్లు నమోదు చేయించండి ..పార్టీ నేతలకు కేటీఆర్, హరీశ్రావు దిశానిర్దేశం
Today's Motivation
Today's Motivation
Back
Post Ad
To Ads