South India's No.1 Digital Mobile Paper
LIVE
Welcome to Smacy Media

అసెంబ్లీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ డ్రామా : ఎంపీ రఘునందన్ రావు

అసెంబ్లీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ డ్రామా : ఎంపీ రఘునందన్ రావు

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండూ ఒకే తాను ముక్కలని, కేసీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరూ నయా నిజాంలుగా మారారని బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలు చర్చకు రాకుండా కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి ముందుగానే ప్లాన్ చేసుకుని నాటకమాడాయని ఆరోపించారు. ఆదివారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ సాక్షిగా గతంలో కేసీఆర్, ఇప్పుడు రేవంత్ రెడ్డి నిజాం నవాబును పొగిడిన వీడియోలను ఈ సందర్భంగా మీడియాకు ప్రదర్శించారు. నిరంకుశ నిజాంను కీర్తించడంలో ఇద్దరి వైఖరీ ఒక్కటేనని మండిపడ్డారు. ఈ నయా నిజాంలను తరిమికొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.
ఎంఐఎంకు బానిసలయ్యారు..
నేడు కేసీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరూ పాతబస్తీకి వెళ్లి ఎంఐఎంకు బానిసలుగా మారి ప్రవర్తిస్తున్నారని ఎంపీ ఎద్దేవా చేశారు. ఇక నాడు బీఆర్ఎస్, నేడు కాంగ్రెస్ వెంట నడుస్తున్న కమ్యూనిస్టులు తోక పార్టీలుగా మారిపోయారని విమర్శించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌‌కు బై ఎలక్షన్లలో గెలిచిన చరిత్ర లేదని, ఉపఎన్నికలు ఆయనకు ఏమాత్రం అచ్చిరావని జోస్యం చెప్పారు.

📍 Telangana
📰 V6 News
🕒 2 days ago

Related News

మలేషియాలో టూరిస్ట్ వీసాతో ఉద్యోగం చేయొద్దు : భారత హైకమిషన్
మలేషియాలో టూరిస్ట్ వీసాతో ఉద్యోగం చేయొద్దు : భారత హైకమిషన్
గ్రాడ్యుయేట్ ఓట్లు నమోదు చేయించండి ..పార్టీ నేతలకు కేటీఆర్, హరీశ్రావు దిశానిర్దేశం
గ్రాడ్యుయేట్ ఓట్లు నమోదు చేయించండి ..పార్టీ నేతలకు కేటీఆర్, హరీశ్రావు దిశానిర్దేశం
Today's Motivation
Today's Motivation
Back
Post Ad
To Ads