South India's No.1 Digital Mobile Paper
LIVE
Welcome to Smacy Media

కేసీఆర్ ఫాంహౌస్ ఏమైనా టూరిస్ట్ కేంద్రమా? : కేంద్ర మంత్రి బండి సంజయ్

కేసీఆర్ ఫాంహౌస్ ఏమైనా టూరిస్ట్ కేంద్రమా? : కేంద్ర మంత్రి బండి సంజయ్

కరీంనగర్, వెలుగు: అధికార పార్టీ నేతలు కేసీఆర్ ఫామ్ హౌస్ కు ఎందుకు వెళ్లారని, ఆ ఫాంహౌస్ ఏమైనా టూరిస్ట్ కేంద్రమా అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. ప్రైవేట్ వ్యక్తుల భూముల్లోకి వెళ్లే అధికారం కాంగ్రెస్ నేతలకు ఎవరిచ్చారన్నారు. ఫాంహౌస్ లో ఒకవేళ సర్కార్ భూములుంటే తక్షణమే వాటిని స్వాధీనం చేసుకునే హక్కు ప్రభుత్వానికి ఉందని, ఆ విషయాన్ని వదిలేసి ఈ రాజకీయ డ్రామాలేమిటని మండిపడ్డారు.
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ ఆవరణలో మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, స్థానిక కార్పొరేటర్లతో కలిసి ఆయన మున్సిపల్ శానిటేషన్ సిబ్బందికి ట్రైసైకిల్స్, ఫాగ్ మిషన్స్ ను అందజేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్ నేతలు రూ.లక్ష కోట్ల భూదోపిడీ చేసినట్లు ఆధారాలుంటే డాక్యుమెంట్స్ తో సహా బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

ఖైరతాబాద్ ఉప ఎన్నికలకు భయపడి కాంగ్రెస్ అనర్హత కేసులో స్టే కోసం సుప్రీంకోర్టుకు వెళ్లిందని ఎద్దేవా చేశారు. ఉప ఎన్నికలొస్తే కాంగ్రెస్ ను రాజకీయ నిమజ్జనం చేయడం తథ్యమని ఉద్ఘాటించారు. 22ఏతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. 22ఏ సమస్యను పరిష్కరించకపోతే న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఉప ఎన్నికల్లో పోటీ బీజేపీ, బీఆర్ఎస్ మధ్యనే ఉంటుందని, కాంగ్రెస్ తమకు పోటీ కానేకాదన్నారు.

దానం నాగేందర్ తనను తాను ఖైరతాబాద్ వినాయకుడితో పోల్చుకోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. వినాయకుడిని చివర్లో నిమజ్జనం చేస్తారనే విషయాన్ని దానం నాగేందర్ గుర్తుంచుకుని జాగ్రత్త పడితే బెటర్ అన్నారు. ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ను రాజకీయ నిమజ్జనం చేయడం తథ్యమన్నారు.

📍 Telangana
📰 V6 News
🕒 2 days ago

Related News

మలేషియాలో టూరిస్ట్ వీసాతో ఉద్యోగం చేయొద్దు : భారత హైకమిషన్
మలేషియాలో టూరిస్ట్ వీసాతో ఉద్యోగం చేయొద్దు : భారత హైకమిషన్
గ్రాడ్యుయేట్ ఓట్లు నమోదు చేయించండి ..పార్టీ నేతలకు కేటీఆర్, హరీశ్రావు దిశానిర్దేశం
గ్రాడ్యుయేట్ ఓట్లు నమోదు చేయించండి ..పార్టీ నేతలకు కేటీఆర్, హరీశ్రావు దిశానిర్దేశం
Today's Motivation
Today's Motivation
Back
Post Ad
To Ads