South India's No.1 Digital Mobile Paper
LIVE
Welcome to Smacy Media

చీటర్ కేసీఆర్.. ఉద్యమం పేరిట దోపిడీ..మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ ఫైర్

చీటర్ కేసీఆర్.. ఉద్యమం పేరిట దోపిడీ..మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ ఫైర్

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఉద్యమం ముసుగులో బీఆర్ఎస్ చీఫ్‌‌ కేసీఆర్ ప్రజల ఆస్తులను, వేల కోట్ల రూపాయలను నిలువునా దోచుకున్నారని మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ధరావత్ రవీంద్రనాయక్ మండిపడ్డారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం నాడు తాను ఎంపీ పదవికి రాజీనామా చేసి, ఉద్యమం కోసం హైదరాబాద్‌‌లోని ఎమ్మెల్యే కాలనీ, సాగర్ సొసైటీ, పికెట్ సికింద్రాబాద్‌‌లలో తనకున్న 2,902 గజాల భూమిని అమ్ముకున్నానని రవీంద్రనాయక్ తెలిపారు. కానీ, పచ్చి అబద్ధాలకోరు, చీటర్ అయిన కేసీఆర్ మాత్రం ఉద్యమం పేరు చెప్పుకుని అసెంబ్లీ సాక్షిగా ఏకంగా 2,902 ఎకరాల పేదల భూములను, వేల కోట్ల ప్రజల సొమ్మును అక్రమంగా కొల్లగొట్టాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
తెలంగాణను అప్పులపాలు చేసిన కేసీఆర్.. ఇప్పుడు తనకు నివాసయోగ్యమైన ఇల్లు లేదని, కారు పార్కింగ్‌‌కు కూడా స్థలం లేదని చెప్పడం అత్యంత హాస్యాస్పదంగా ఉందని రవీంద్ర నాయక్ ఎద్దేవా చేశారు. పార్లమెంట్‌‌లో తాను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతపై పదేపదే గళం విప్పితే, కేసీఆర్ మాత్రం ఏనాడూ నోరు విప్పలేదని, ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని ఆస్తులు కూడబెట్టడానికే పరిమితమయ్యారని విమర్శించారు.

📍 Telangana
📰 V6 News
🕒 2 days ago

Related News

మలేషియాలో టూరిస్ట్ వీసాతో ఉద్యోగం చేయొద్దు : భారత హైకమిషన్
మలేషియాలో టూరిస్ట్ వీసాతో ఉద్యోగం చేయొద్దు : భారత హైకమిషన్
గ్రాడ్యుయేట్ ఓట్లు నమోదు చేయించండి ..పార్టీ నేతలకు కేటీఆర్, హరీశ్రావు దిశానిర్దేశం
గ్రాడ్యుయేట్ ఓట్లు నమోదు చేయించండి ..పార్టీ నేతలకు కేటీఆర్, హరీశ్రావు దిశానిర్దేశం
Today's Motivation
Today's Motivation
Back
Post Ad
To Ads