South India's No.1 Digital Mobile Paper
LIVE
Welcome to Smacy Media

తారిఫ్ ల బిల్లుకు అమెరికా కాంగ్రెస్ ఆమోదం.. భారత్ పై 100 శాతం సుంకాలు తప్పవా ?

తారిఫ్ ల బిల్లుకు అమెరికా కాంగ్రెస్ ఆమోదం.. భారత్ పై 100 శాతం సుంకాలు తప్పవా ?

రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేసే దేశాలపై 100శాతం తారిఫ్‌లు విధించే లిండ్సే గ్రాహం రష్యా, ఇరాన్ ఆంక్షల బిల్లుకు అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. ఇద్దరు డెమోక్రటిక్​ సభ్యులు రిపబ్లికన్లకు అనుకూలంగా వేయడంతో బిల్లు పాస్​ అయ్యింది. రష్యాపై ఆంక్షల బిల్లుతోపాటు ఇతర చట్టాలకు సంబందించిన బిల్లు 214–211 ఓట్ల తేడాలో అమెరికా కాంగ్రెస్​ ఆమోదం పొందింది ..కాంగ్రెస్ ఉభయసభల ఆమోదం పొందిన ఈ బిల్లును ఇక సంతకం కోసం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వద్దకు పంపనున్నారు. ట్రంప్ ఇప్పటికే దీనిపై సానుకూలంగా స్పందిస్తూ సంతకం చేస్తానని తెలిపారు. రష్యా యుద్ద వ్యయానికి వస్తున్న నిధులను అడ్డుకోవడమే లక్ష్యంగా తారీఫ్​ల బిల్లును తీసుకొచ్చింది ట్రంప్​ప్రభుత్వం. ట్రంప్​ సంతకంతో ఇది చట్టమైతే భారత్​ లాంటి దేశాలపై ప్రభావం తీవ్రంగానే అవకాశం ఉంది.

అమెరికా ఈ చట్టాన్ని ప్రయోగిస్తే, అది నేరుగా రష్యా ముడిచమురు ధరలపై కాకుండా, అమెరికాకు ఎగుమతి అయ్యే భారతీయ వస్తువులపై 100శాతం వరకు అదనపు పన్నుల రూపంలో పడనుంది. అమెరికా మార్కెట్లో ఐటీ, ఫార్మాస్యూటికల్స్, టెక్స్‌టైల్స్, ఇంజనీరింగ్ వస్తువులు, రత్నాలు-, ఆభరణాలు వంటి రంగాలకు చెందిన భారతీయ ఉత్పత్తులపై విపరీతంగా ప్రభావం చూపుతుంది. దీనివల్ల అమెరికాలో భారతీయ వస్తువుల డిమాండ్ తగ్గి, భారతీయ ఎగుమతిదారులు భారీగా నష్టపోయే ప్రమాదం ఉంది.

📍 Andhra
📰 V6 News
🕒 6 days ago

Related News

Jurala | రైతుల దెబ్బకు దిగొచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం..! జూరాల కుడి, ఎడమ కాలువలకు సాగునీరు విడుదల
Jurala | రైతుల దెబ్బకు దిగొచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం..! జూరాల కుడి, ఎడమ కాలువలకు సాగునీరు విడుదల
పిఠాపురంలో నన్ను గెలిపించి రాష్ట్రాభివృద్ధికి పునాది వేశారు.
పిఠాపురంలో నన్ను గెలిపించి రాష్ట్రాభివృద్ధికి పునాది వేశారు.
5 రోజులు బ్యాంకులు బంద్‌
5 రోజులు బ్యాంకులు బంద్‌
Back
Post Ad
To Ads