South India's No.1 Digital Mobile Paper
LIVE
Welcome to Smacy Media

Jurala | రైతుల దెబ్బకు దిగొచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం..! జూరాల కుడి, ఎడమ కాలువలకు సాగునీరు విడుదల

Jurala | రైతుల దెబ్బకు దిగొచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం..! జూరాల కుడి, ఎడమ కాలువలకు సాగునీరు విడుదల

Jurala | ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు(Jurala)లోకి 2,687 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది.గద్వాల/మహబూబ్‌నగర్‌ : ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు(Jurala)లోకి 2,687 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. దీంతో అధికార యంత్రాంగం హుటాహుటిన కుడి, ఎడమ కాలువలకు నీటిని విడుదల చేసింది. బుధవారం ఉదయం 8 గంటలకు కూడి ఎడమ కాలువల వద్దకు చేరుకున్న అధికారులు తూములను తెరిచి కిందికి నీళ్లను వదిలిపెట్టారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం జూరాల ప్రాజెక్టుకు 2,687 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ఈ ఇన్‌ఫ్లోను ఇలాగే ఒడిసి పడితే పూర్తిస్థాయిలో నిండి ఏకంగా స్పిల్ గేట్లను తెరవాల్సిన పరిస్థితి వస్తుంది.ఇదే జరిగితే మళ్లీ కిందికి నీళ్లు వెళతాయి. రైతాంగం ఆగ్రహం మరింత పెళ్లుబికుతుందని భయపడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం హుటాహుటిన కుడి, ఎడమ కాలువలకు నీటి విడుదల చేయాలని అధికారులు కోరిన పట్టించుకోకపోవడంతో.. చివరకు అధికార యంత్రాంగమే కుడి, ఎడమ కాలువలకు నీళ్లు విడుదల చేయడం గమనార్హం. మొత్తం మీద రైతుల పోరాటం ఫలించి ప్రభుత్వం దిగివచ్చి కుడి, ఎడమ కాలువలకు నీళ్లు విడుదల చేయడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు.మరోవైపు జూరాల ప్రాజెక్టుకు సాగు, తాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేయాలని కోరుతూ ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు బెంగళూరులో కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను కలిశారు. జూరాల ఆయకట్టు రైతుల సాగునీటి సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా 30 రోజుల పాటు రోజుకు 5 వేల క్యూసెక్కుల చొప్పున మొత్తం 7 టీఎంసీల నీటిని జూరాల ప్రాజెక్టుకు విడుదల చేస్తామని కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌ హామీ ఇచ్చినట్లు ప్రజాప్రతినిధులు తెలిపారు.

📍 Jurala
📰 Smacy News
🕒 1 hr ago

Related News

పిఠాపురంలో నన్ను గెలిపించి రాష్ట్రాభివృద్ధికి పునాది వేశారు.
పిఠాపురంలో నన్ను గెలిపించి రాష్ట్రాభివృద్ధికి పునాది వేశారు.
5 రోజులు బ్యాంకులు బంద్‌
5 రోజులు బ్యాంకులు బంద్‌
ఉత్తరాంధ్రపై వాయుగుండం పడగ రాత్రి 11.30 వరకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్
ఉత్తరాంధ్రపై వాయుగుండం పడగ రాత్రి 11.30 వరకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్
Back
Post Ad
To Ads