South India's No.1 Digital Mobile Paper
LIVE
Welcome to Smacy Media

ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా..తహసీల్దార్, ఆర్డీవో భవనాలకు నిధులు మంజూరు చేయట్లే: ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి

ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా..తహసీల్దార్, ఆర్డీవో భవనాలకు నిధులు మంజూరు చేయట్లే: ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం అసెంబ్లీ క్వశ్చన్ అవర్ లో నియోజకవర్గాల్లో తహశీల్దార్, ఆర్డీవో కార్యాలయాల నిర్మాణాలపై రాకేష్ రెడ్డి ప్రశ్నించారు. ఈ సందర్భంగా తన నియోజకవర్గం ఆర్మూర్ లో నిజాం కాలంలో నిర్మించిన తహసీల్దార్, ఆర్డీవో ఆఫీసులు శిథిలా వస్ధకు చేరుకున్నాయని తెలిపారు. కొత్త వాటి కోసం రెవిన్యూ మంత్రిని గత రెండేళ్ల నుంచి కోరుతున్నప్పటికి మంజూరు చేయలేదన్నారు.

ప్రభుత్వం చేసే చర్యల వల్ల అవసరం అయితే రాజీనామా చేస్తా అని ప్రకటించారు. తనకు 10 నిమిషాలు మాట్లాడే అవకాశం ఇవ్వాలని, తాను రాజీనామా చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. కొడంగల్ తో పాటు మంత్రుల నియోజకవర్గాలకు ఎన్ని నిదులు తీసుకెళ్తున్నారు - తమ జిల్లాకు ఎన్ని నిదులు ఇచ్చారో పూర్తి వివరాలు తీసుకొచ్చానన్న ఆయన.. అన్ని లెక్కలు చెప్పి రాజీనామా చేస్తానని, పది నిమిషాలు మాట్లాడే అవకాశం ఇవ్వాలని స్పీకర్ ను కోరారు. మంత్రివర్గంలో నిజామాబాద్ జిల్లాకు ప్రాతినిథ్యం లేకపోవటంతో అనాధ అయిందని, ఎవరూ పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

📍 Andhra
📰 V6 News
🕒 6 days ago

Related News

Jurala | రైతుల దెబ్బకు దిగొచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం..! జూరాల కుడి, ఎడమ కాలువలకు సాగునీరు విడుదల
Jurala | రైతుల దెబ్బకు దిగొచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం..! జూరాల కుడి, ఎడమ కాలువలకు సాగునీరు విడుదల
పిఠాపురంలో నన్ను గెలిపించి రాష్ట్రాభివృద్ధికి పునాది వేశారు.
పిఠాపురంలో నన్ను గెలిపించి రాష్ట్రాభివృద్ధికి పునాది వేశారు.
5 రోజులు బ్యాంకులు బంద్‌
5 రోజులు బ్యాంకులు బంద్‌
Back
Post Ad
To Ads