South India's No.1 Digital Mobile Paper
LIVE
Welcome to Smacy Media

Rashmika Mandanna: ఎం.ఎస్‌.సుబ్బులక్ష్మి బయోపిక్‌లో రష్మిక మందన్న.. టైటిల్ అనౌన్స్ చేసిన మేకర్స్

Rashmika Mandanna: ఎం.ఎస్‌.సుబ్బులక్ష్మి బయోపిక్‌లో రష్మిక మందన్న.. టైటిల్ అనౌన్స్ చేసిన మేకర్స్

కర్ణాటక సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఎం.ఎస్‌.సుబ్బులక్ష్మి జీవిత కథ ఇప్పుడు వెండితెరపైకి రాబోతోంది. ఆమె జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కనున్న బయోపిక్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ సినిమాకు ‘ఎం.ఎస్‌.సుబ్బులక్ష్మి అమ్మ’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ ప్రతిష్టాత్మక బయోపిక్‌లో ఎం.ఎస్‌.సుబ్బులక్ష్మి పాత్రను రష్మిక మందన్న పోషించనున్నారు. ఈ పాత్ర కోసం రష్మిక ఇప్పటికే లుక్ టెస్ట్ కూడా చేసినట్లు సమాచారం. దీంతో ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి మొదలైంది.

భారతరత్న, ఎం.ఎస్‌.సుబ్బులక్ష్మి 116వ జయంతిని పురస్కరించుకుని.. రేపు సెప్టెంబర్ 16న చెన్నైలో ఈ సినిమాను గ్రాండ్‌గా లాంచ్ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి విశ్వనటుడు కమల్ హాసన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఇక ఈ బయోపిక్‌కు మరో క్రేజీ కాంబినేషన్ కూడా కుదిరింది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించనుండగా.. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సంగీతం అందించనున్నారు. టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ గీతా ఆర్ట్స్ నిర్మించనుంది.

📍 Andhra
📰 V6 News
🕒 8 days ago

Related News

Jurala | రైతుల దెబ్బకు దిగొచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం..! జూరాల కుడి, ఎడమ కాలువలకు సాగునీరు విడుదల
Jurala | రైతుల దెబ్బకు దిగొచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం..! జూరాల కుడి, ఎడమ కాలువలకు సాగునీరు విడుదల
పిఠాపురంలో నన్ను గెలిపించి రాష్ట్రాభివృద్ధికి పునాది వేశారు.
పిఠాపురంలో నన్ను గెలిపించి రాష్ట్రాభివృద్ధికి పునాది వేశారు.
5 రోజులు బ్యాంకులు బంద్‌
5 రోజులు బ్యాంకులు బంద్‌
Back
Post Ad
To Ads