South India's No.1 Digital Mobile Paper
LIVE
Welcome to Smacy Media

ఇటలీ నాయకుడి ‘ఓట్‌ చోర్‌’ కామెంట్స్‌.. రాహుల్‌పై మండిపడ్డ భాజపా

ఇటలీ నాయకుడి ‘ఓట్‌ చోర్‌’ కామెంట్స్‌.. రాహుల్‌పై మండిపడ్డ భాజపా

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత అంతర్గత వ్యవహారాల్లో విదేశీ రాజకీయ నాయకులు జోక్యం చేసుకొనేలా రాహుల్‌ (Rahul Gandhi) పురిగొల్పుతున్నారని భాజపా తీవ్ర ఆరోపణలు చేసింది. ఇటలీ వామపక్ష పీఈసీ నాయకుడు జియాకోమో ఫిల్‌బెక్‌ హైదరాబాద్‌లో జరిగిన భారత్‌ సమిట్‌లో ‘ఓట్‌ చోర్‌ గద్దీ చోడ్‌’ అని వ్యాఖ్యానించడం దుమారం రేపుతోంది. ఆయన ఈ వ్యాఖ్యలు చేయడాన్ని కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు (Kiren Rijiju) తప్పుపట్టారు. ‘‘భారత్‌ను అవమానించినప్పుడు ఎవరైనా నవ్వడం మీరు చూశారా..? నేను అడిగేది.. భారత్‌ను అవమానించేందుకు విదేశాలకు వెళ్లే వ్యక్తి గురించి కాదు’’ అని పేర్కొన్నారు.

సీఎం కార్యక్రమంలో మాట్లాడనీయలేదని.. మైక్‌ను విసిరికొట్టిన ఎమ్మెల్యే: వీడియో వైరల్‌

మరోవైపు హోంశాఖ మంత్రి అమిత్‌షా కూడా మహారాష్ట్రలో జరిగిన ర్యాలీలో స్పందించారు. ‘‘వామపక్ష భావజాల ప్రచారకులను దేశ విదేశాల నుంచి కాంగ్రెస్‌ పిలిపించింది. కాంగ్రెస్‌ యువరాజు కూడా అక్కడికి వెళ్లారు. దానికి వాళ్లు ‘భారత్‌ సమిట్‌’ అనే పేరు పెట్టారు. అంతర్జాతీయ సదస్సులో భారత్‌ కీర్తిని ప్రపంచ వ్యాప్తంగా మసకబార్చే పనిని రాహుల్‌ ఇప్పటికీ చేస్తున్నారు’’ అని విమర్శలు గుప్పించారు.

📍 Guntur
📰 Eenadu Telugu
🕒 6 days ago

Related News

మలివిడత పుర పోరు .. మేయర్‌, ఛైర్మన్‌ స్థానాలకు కూటమి అభ్యర్థులు వీరే
మలివిడత పుర పోరు .. మేయర్‌, ఛైర్మన్‌ స్థానాలకు కూటమి అభ్యర్థులు వీరే
వ్యోమనౌకను గాల్లోనే ఒడిసిపట్టి
వ్యోమనౌకను గాల్లోనే ఒడిసిపట్టి
డబ్ల్యూపీఎల్ 2027.. ఆ మ్యాచ్‌లన్నీ వాంఖడే స్టేడియంకు షిప్ట్
డబ్ల్యూపీఎల్ 2027.. ఆ మ్యాచ్‌లన్నీ వాంఖడే స్టేడియంకు షిప్ట్
⬅ Back
➕ Post Ad
To Ads ➡