South India's No.1 Digital Mobile Paper
LIVE
Welcome to Smacy Media

అమెరికా వాణిజ్య మంత్రి మెడకు చుట్టుకున్న జెన్సన్‌ వ్యవహారం

అమెరికా వాణిజ్య మంత్రి మెడకు చుట్టుకున్న జెన్సన్‌ వ్యవహారం

ఇంటర్నెట్‌డెస్క్‌: జెన్సన్‌ హువాంగ్ (jensen huang) వ్యవహారం.. ట్రంప్‌ కార్యవర్గంలోని ఓ మంత్రి మెడకు చుట్టుకుంటోంది. అత్యంత శక్తిమంతమైన చిప్స్‌ను చైనా (China)కు ఎగుమతి చేయకుండా అడ్డుకోవడంలో అమెరికా వాణిజ్య మంత్రి లుట్నిక్‌ (Howard Lutnick) కాలయాపన చేయడంపై తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన్ను పదవి నుంచి తొలగించే అంశంపై శ్వేతసౌధంలో చర్చలు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని అమెరికా వార్తా సంస్థ తన కథనంలో పేర్కొంది. ఇప్పటికే అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్‌ బెస్సెంట్‌ కూడా లుట్నిక్‌ తీరును తప్పుపట్టారు. నిన్న రాత్రి మాత్రం శ్వేతసౌధం ప్రతినిధి స్పందిస్తూ లుట్నిక్‌పై ట్రంప్‌నకు విశ్వాసం ఉందని పేర్కొనడం గమనార్హం.

రిపబ్లికన్‌ పార్టీ సెనెటర్‌ జాన్‌ కెన్నడీ ఈ వ్యవహారంపై స్పందిస్తూ.. లుట్నిక్‌ పదవిలో ఉండాలా..? వద్దా అనే అంశంపై ఇంకా స్పష్టత లేదని పేర్కొన్నారు. అయితే జరిగిన నష్టానికి మాత్రం ఆయన కచ్చితంగా కాంగ్రెస్‌ ఎదుట హాజరై వివరణ ఇవ్వాల్సిందే అని స్పష్టం చేశారు. మరో సెనెటర్‌ టామ్‌ కాటన్‌ స్పందిస్తూ.. చైనా సంస్థ సీఎక్స్‌ఎంటీని అమెరికా మార్కెట్‌ నుంచి నిషేధించాలని లుట్నిక్‌ను కోరారు.

అలిస్‌ సంబంధిత కంపెనీలో 50,000 చిప్స్‌..
సింగపూర్‌లోని మెగాస్పీడ్‌ కంపెనీకి సంబంధించిన ఎగ్జిక్యూటివ్‌, చైనా గూఢచారి అలిస్‌ హువాంగ్‌తో జెన్సన్‌కు వివాహేతర సంబంధం ఉంది. ఈ కంపెనీ అవసరమైన దానికంటే 50,000 చిప్స్‌ను అదనంగా దిగుమతి చేసుకున్నట్లు తేలింది. అధికారులు ఆ కంపెనీ డేటా సెంటర్‌ను తనిఖీ చేసిన వేళ ఈ విషయం వెలుగు చూడటంతో వారిలో అనుమానాలు పెరిగాయి. 2025 నుంచి ఈ కంపెనీ తీరు అనుమానాస్పదంగా ఉన్నట్లు కామర్స్‌ డిపార్ట్‌మెంట్‌ మాజీ అధికారి ఒకరు పేర్కొన్నారు.

చైనా లొసుగు ఇదే..
చైనాకు శక్తిమంతమైన చిప్స్‌ను ఎగుమతి చేయకుండా బైడెన్‌ సర్కారు కఠిన ఆంక్షలను తీసుకొచ్చింది. అయితే చైనా దీనిని తప్పించుకునేలా ఆగ్నేయాసియా దేశాలైన సింగపూర్‌, మలేషియా, థాయ్‌లాండ్‌ వంటి చోట్ల డేటా సెంటర్లను ఏర్పాటు చేసింది. అక్కడికి అమెరికా శక్తిమంతమైన చిప్స్‌ను తెప్పించి.. చైనా భూభాగం నుంచి రిమోట్‌ విధానంలో వాటి ఏఐ కంప్యూటింగ్‌ శక్తిని వాడుకోవడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో మెగాస్పీడ్‌ ద్వారా భారీగా చిప్స్‌ను తెప్పించి ఉంటుందని సమాచారం.

అమెరికా వాణిజ్య శాఖ మంత్రి మోకాలడ్డు
ఏఐ చిప్స్‌ ఎగుమతులపై బైడెన్‌ సర్కారు విధించిన ఆంక్షలను తొలగించేందుకు తమ శాఖలో సిబ్బంది పనిచేసినట్లు ఇటీవల పదవీవిరమణ చేసిన ఉద్యోగి అమెరికా మీడియాకు వెల్లడించారు. ఆగ్నేయాసియా దేశాలకు చిప్స్‌ అమ్మాలంటే.. ఎగుమతి లైసెన్స్‌ అవసరమయ్యే ఓ కొత్త విధానంపై పనిచేశారన్నారు. చివరికి లుట్నిక్‌ తిరస్కారంతో అది అమలు కాలేదని చెప్పారు. ఈ నిబంధన అమల్లోకి వచ్చి ఉంటే.. మెగాస్పీడ్‌, ఇతర ఆగ్నేయాసియా దేశాలకు చిప్స్‌ సరఫరా జరిగేది కాదన్నారు.

📍 Tirupathi
📰 Eenadu Telugu
🕒 9 days ago

Related News

మలివిడత పుర పోరు .. మేయర్‌, ఛైర్మన్‌ స్థానాలకు కూటమి అభ్యర్థులు వీరే
మలివిడత పుర పోరు .. మేయర్‌, ఛైర్మన్‌ స్థానాలకు కూటమి అభ్యర్థులు వీరే
వ్యోమనౌకను గాల్లోనే ఒడిసిపట్టి
వ్యోమనౌకను గాల్లోనే ఒడిసిపట్టి
రాజకీయాల నుంచి తప్పుకోను: గడ్కరీ
రాజకీయాల నుంచి తప్పుకోను: గడ్కరీ
⬅ Back
➕ Post Ad
To Ads ➡