South India's No.1 Digital Mobile Paper
LIVE
Welcome to Smacy Media

హర్మూజ్ కాదు.. ఈ సముద్ర మార్గమే అత్యంత ప్రాణాంతకం!

హర్మూజ్ కాదు.. ఈ సముద్ర మార్గమే అత్యంత ప్రాణాంతకం!

ఇంటర్నెట్‌ డెస్క్: అమెరికాతో ఉద్రిక్తతల నేపథ్యంలో హర్మూజ్‌ జలసంధిలోని నౌకలను ఇరాన్‌ లక్ష్యంగా చేసుకుంటోంది. ఈ దాడుల్లో విధి నిర్వహణలో ఉన్న మర్చంట్‌నేవీ నావికులు చనిపోతున్నారు. అయితే.. ఈ ఏడాది ఓ సముద్ర మార్గం హర్మూజ్‌ను మించి ప్రమాదకరంగా మారింది. అదే నల్ల సముద్రం (Black Sea). ఉక్రెయిన్‌- రష్యా యుద్ధం తీవ్రమైన వేళ.. ఈ ఏడాది హర్మూజ్‌లో జరిగిన దాడుల కన్నా.. నల్ల సముద్రంలో జరిగిన దాడుల వల్లే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఓ అంతర్జాతీయ మీడియా కథనం పేర్కొంది.

సముద్ర భద్రతా సంస్థ ‘ఆంబ్రే’ (Ambrey) గణాంకాల ప్రకారం.. ఈ ఏడాదిలో ఇప్పటివరకు నల్ల సముద్రంలో 300కుపైగా దాడులు జరిగాయి. 30 మందికిపైగా నావికులు మృతి చెందారు. మరో 20 మందికి పైగా గల్లంతయ్యారు. అదే హర్మూజ్‌ సహా పశ్చిమాసియా ప్రాంతంలో నౌకలపై జరిగిన 130 దాడుల్లో.. 25 మంది ప్రాణాలు కోల్పోయారు.

📍 Chennai
📰 Eenadu Telugu
🕒 9 days ago

Related News

మలివిడత పుర పోరు .. మేయర్‌, ఛైర్మన్‌ స్థానాలకు కూటమి అభ్యర్థులు వీరే
మలివిడత పుర పోరు .. మేయర్‌, ఛైర్మన్‌ స్థానాలకు కూటమి అభ్యర్థులు వీరే
వ్యోమనౌకను గాల్లోనే ఒడిసిపట్టి
వ్యోమనౌకను గాల్లోనే ఒడిసిపట్టి
డబ్ల్యూపీఎల్ 2027.. ఆ మ్యాచ్‌లన్నీ వాంఖడే స్టేడియంకు షిప్ట్
డబ్ల్యూపీఎల్ 2027.. ఆ మ్యాచ్‌లన్నీ వాంఖడే స్టేడియంకు షిప్ట్
⬅ Back
➕ Post Ad
To Ads ➡