South India's No.1 Digital Mobile Paper
LIVE
Welcome to Smacy Media

కేసీఆర్ ఫాంహౌస్ నీ అబ్బ జాగీరా..విచారణ చేయకుంటే అధికారులపై చర్యలు తప్పవని బ్లాక్మెయిల్ చేస్తరా?: జీవన్ రెడ్డి

కేసీఆర్ ఫాంహౌస్ నీ అబ్బ జాగీరా..విచారణ చేయకుంటే అధికారులపై చర్యలు తప్పవని బ్లాక్మెయిల్ చేస్తరా?: జీవన్ రెడ్డి

హైదరాబాద్​, వెలుగు: కేసీఆర్​ ఫాంహౌస్​పై సీఎం రేవంత్​ రెడ్డి విచారణకు ఆదేశించడం పిరికిపంద చర్య అని బీఆర్​ఎస్​ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్​ రెడ్డి అన్నారు. కేసీఆర్​ ఫాంహౌస్​ ఏమైనా నీ అబ్బ జాగీరా అని సీఎం రేవంత్​నుద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్​ ఫాంహౌస్​కు ఎవరినో యజమానులను చేస్తామని ప్రకటించడం శోచనీయమన్నారు.

బుధవారం ఆయన తెలంగాణ భవన్​లో మాట్లాడారు. నోటీసులు ఇచ్చి విచారణ జరపకపోతే అధికారులపై చర్యలు తప్పవని ముఖ్యమంత్రి స్థాయిలో బ్లాక్ మెయిల్ చేయడం సిగ్గు చేటన్నారు. కేసీఆర్‌‌ అధీనంలో 700 ఎకరాలు, కేటీఆర్‌‌, హరీశ్‌‌ రావులకు వందల ఎకరాల భూమి ఉందని సీఎం అనడం అభ్యంతరకరమన్నారు. ఏడుగురు సోదరుల భూకబ్జాల నుంచి దృష్టి మళ్లించేందుకే రేవంత్ రెడ్డి ఈ రకమైన డైవర్షన్ పాలిటిక్స్ కు తెరలేపారని ఆరోపించారు.

📍 Telangana
📰 V6 News
🕒 6 days ago

Related News

పిఠాపురంలో నన్ను గెలిపించి రాష్ట్రాభివృద్ధికి పునాది వేశారు.
పిఠాపురంలో నన్ను గెలిపించి రాష్ట్రాభివృద్ధికి పునాది వేశారు.
5 రోజులు బ్యాంకులు బంద్‌
5 రోజులు బ్యాంకులు బంద్‌
ఉత్తరాంధ్రపై వాయుగుండం పడగ రాత్రి 11.30 వరకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్
ఉత్తరాంధ్రపై వాయుగుండం పడగ రాత్రి 11.30 వరకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్
Back
Post Ad
To Ads